గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 03, 2020 , 18:42:16

54 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన ఉప ఎన్నికలు

 54 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన ఉప ఎన్నికలు

హైదరాబాద్‌ :  దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఝార్ఖండ్‌, కర్ణాటక, ఒడిశా, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో  వివిధ కారణాల వల్ల పలు స్థానాలు ఖాళీ కాగా..  కేంద్ర ఎన్నికల సంఘం ఆయా స్థానాలకు ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసేంది. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా గుజరాత్‌లో ఎనిమిది, యూపీలో ఏడు, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్‌, నాగాలాండ్‌లో రెండు చొప్పున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, హర్యానాలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి.

సాయంత్రం ఆరుగంటల దాకా పోలింగ్‌ కొనసాగగా అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు.  నవంబర్‌ 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. ఇదిలాఉండగా బీహార్‌ శాసనసభకు మూడు విడుతల్లో  ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ 94 స్థానాలకు రెండో విడుత పోలింగ్‌ పూర్తయ్యింది. పలువురు ప్రముఖులు పోటీ చేస్తున్న స్థానాలకు ఎన్నికలు ముగియడంతో తుది దశ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.