గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 20:59:30

హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నంతో.. క‌రోనా దూరం..

హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నంతో.. క‌రోనా దూరం..

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ కు చెందిన బీజేపీ ఎంపీ ప్ర‌జ్ఞాసింగ్ ఠాకూర్ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నంతో క‌రోనాను దూరం చేయ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ హ‌నుమాన్ చాలీసా ప‌ఠ‌నంతో మ‌న‌కు రెండు ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని చెప్పారు. మ‌న‌సు నిశ్చ‌లంగా ఉండ‌టంతోపాటు క‌రోనా నుంచి ముక్తి ల‌భిస్తుంద‌ని, అదే మ‌న విశ్వాస‌మ‌ని అన్నారు.

మ‌హారాష్ట్ర సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కు శ‌నివారం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో ఆయ‌న భోపాల్‌లోని చిరాయు ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆదివారం అక్క‌డి నుంచే క‌రోనాపై స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య 26 వేలు దాట‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 791 మంది మ‌ర‌ణించారు.


తాజావార్తలు


logo