బుధవారం 08 జూలై 2020
National - Jun 15, 2020 , 16:33:47

మళ్లీ కర్నాటక నుంచి ఏపీకి బస్సులు

మళ్లీ కర్నాటక నుంచి ఏపీకి బస్సులు

బెంగళూరు : కర్నాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బస్సు సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్టీసీ వెల్లడించింది. ఈ నెల 17 నుంచి విడతల వారీగా సర్వీసులు నడపనున్నట్లు పేర్కొంది. తొలివిడతలో బెంగళూరు నుంచి అనంతరపురం, హిందూపురం, కదిరి, పుట్టపర్తి, కల్యాణదుర్గం, రాయదుర్గం, కడప, ప్రొద్దుటూరు, మంత్రాలయం, తిరుపతికి సర్వీసులు నడుస్తాయని తెలిపింది. బళ్లారి నుంచి విజయవాడ, అనంతపురం, కర్నూలు, మంత్రాలయానికి, రాయచూర్‌ నుంచి మంత్రాలయానికి, షాపూర్‌ నుంచి మంత్రాలయం, కర్నూలుకు సర్వీసులు పునర్ధురిస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులు ఆన్‌లైన్‌, కౌంటర్ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది.


logo