సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 21, 2020 , 12:47:46

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు బంద్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులు బంద్‌

కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం (మార్చి 22న) మొత్తం ఆర్టీసీ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. 

అన్ని పట్టణాల్లో లోక్‌ల్‌ సర్వీసులను ఆదివారం ఉదయం నుంచి నిలిపివేయనున్నామని, దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసులను మాత్రం శనివారం రాత్రి నుంచే నిలిపివేస్తామని మంత్రి నాని వెల్లడించారు. ఈ బస్సుల బంద్‌ ఆదివారం రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు బస్సు సర్వీసుల యాజమాన్యాలు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.     


logo