గురువారం 04 జూన్ 2020
National - May 15, 2020 , 14:45:21

హ‌ర్యానాలో తిరుగుతున్న బ‌స్సులు..

హ‌ర్యానాలో తిరుగుతున్న బ‌స్సులు..

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ వ‌ల్ల బ‌స్సు స‌ర్వీసులు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ హ‌ర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో ప్ర‌భుత్వ బ‌స్సులు స‌ర్వీసులుప్రారంభించాయి. మార్చిలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఇవాళే బ‌స్సులు రోడ్డెక్కాయి. అయితే ఒక్కొక్క బ‌స్సులో 30 మంది ప్ర‌యాణికుల క‌న్నా ఎక్కువ ఎక్కించుకోవ‌డం లేదు. సోష‌ల్ డిస్టాన్సింగ్ కూడా పాటించాలి.  ఉద‌యం నుంచి కొన్ని ఎంపిక చేసిన రూట్ల‌లో మాత్ర‌మే బ‌స్సులు న‌డుస్తున్నాయి.  అంబాలా, భివాని, హిసార్‌, కైతాల్‌, క‌ర్నాల్‌, నార్నౌల్‌, పంచ‌కులా, రివారి, రోహ‌త‌క్‌, సిర్సా ప‌ట్ట‌ణాల నుంచి 29 రూట్ల‌లో బ‌స్సులు న‌డ‌వ‌నున్నాయి.  హ‌ర్యానాలో మొత్తం 4వేల ప్ర‌భుత్వ బ‌స్సులు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో బుకింగ్‌, మాస్క్‌లు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి. logo