శనివారం 30 మే 2020
National - May 18, 2020 , 16:38:15

కరోనా హాట్‌స్పాట్స్‌ మినహా ఇతర ప్రాంతాల్లో బస్సులు

కరోనా హాట్‌స్పాట్స్‌ మినహా ఇతర ప్రాంతాల్లో బస్సులు

తిరువనంతపురం: నాలుగో విడత లాక్‌డౌన్ సందర్భంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఏకే శశిధరన్‌ ఒక ప్రకటన చేశారు. అయితే కరోనా హాట్‌స్పాట్స్‌ మినహా మిగిలిన ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నడుపాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 19 హాట్‌స్పాట్‌లు ఉన్నాయని, ఆ 19 హాట్‌స్పాట్స్‌ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో లోకల్‌ బస్సులు నడుస్తాయన్నారు. అయితే అంతర్‌ జిల్లాల, అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసులపై మాత్రం ఎప్పటిలాగే నిషేధం కొనసాగుతుందని మంత్రి శశిధరన్ చెప్పారు. 


logo