గురువారం 04 మార్చి 2021
National - Jan 17, 2021 , 06:44:23

బస్‌కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి

బస్‌కు వ్యాపించిన మంటలు.. ఆరుగురు మృతి

జైపూర్‌ : రాజస్థాన్‌లోని మహేశ్‌పురలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. జైన యాత్రికులతో కూడిన బస్సుకు విద్యుత్‌ వైర్లు మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు ఆరుగురు మంది మరణించగా.. మరో ఎనిమిది మంది వరకు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానిక ప్రజలు అంబులెన్స్‌లో గాయపడ్డ వారిని జోద్‌పూర్‌ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైనా మతానికి చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్‌.. దారి తప్పి మహేశ్‌పుర వైపు చేరుకుంది. అదే సమయంలో అక్కడికి మరికొన్ని బస్‌లు రాగా.. డ్రైవర్‌ దారి తప్పినట్లు తెలుసుకొని, తిరిగి ప్రధాన రహదారిపై వస్తున్నారు. అదే సమయంలో విద్యుత్‌ వైర్లు తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి.

ఎంత ఎత్తులో ఉన్నాయో తెలుసుకునేందుకు కండక్టర్‌ బస్సుపైకి ఎక్కగా.. విద్యుత్‌ షాక్‌ తగిలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కండక్టర్‌ బస్‌పైనే సజీవ దహనం కాగా.. బస్సుకు విద్యుత్‌ సరఫరా జరిగి మంటలు వ్యాపించాయని వెంటనే ఇది గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకొని గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారని పోలీసులు, వైద్యులు తెలిపారు. కాగా, బస్‌లో ప్రయాణిస్తున్న వారంతా జైన మతానికి చెందిన వారని.. నకోడాజీ, మాండోలి నగరాలకు వెళ్లి తిరిగి బేవార్‌కు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సాయంత్రం జలోర్‌ జైన్‌ బోర్డింగ్‌ వద్ద అల్పహారం చేసి అక్కడి నుంచి బయలుదేరారు. దారి తప్పడంతో మహేశ్‌పుర వైపు చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

VIDEOS

logo