మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 22, 2020 , 13:31:36

జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు కొట్టుకుపోయిన వైనం

జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు కొట్టుకుపోయిన వైనం

రాయ్‌పూర్ : జ‌వాన్లు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు వ‌ర‌ద ప్ర‌వాహ వేగానికి కొట్టుకుపోయింది. అదృష్ట‌వ‌శాత్తు జ‌వాన్లంద‌రూ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ర్టంలోని బీజాపూర్ జిల్లా మిర్తూర్ వ‌ద్ద సోమ‌వారం చోటుచేసుకుంది. అధికార‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. డిస్ర్టిక్ట్ రిజ‌ర్వ్ గార్డ్‌(డీఆర్‌జీ) కు చెందిన 30 మంది జ‌వాన్లు సెర్చ్ ఆప‌రేష‌న్ నుండి తిరిగి వ‌స్తున్నారు. జిల్లాలో గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా నీటి ప్ర‌వాహాలు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న కాలువ బ్రిడ్జీని దాటే క్ర‌మంలో ప్ర‌వాహ వేగానికి బ‌స్సు అదుపుత‌ప్పి నీటిలో బోల్తాప‌డింది. అప్ప‌టికే బ‌స్సులోంచి దిగిన జ‌వాన్లు ప‌రుగున వెళ్లి మిగ‌తా జ‌వాన్ల‌ను ర‌క్షించారు. బ‌స్సులోని జ‌వాన్లంతా సుర‌క్షితంగా ఉన్న‌ట్లు బీజాపూర్ ఎస్పీ క‌మ‌లోచ‌న క‌శ్య‌ప్ తెలిపారు. 


logo