ఆదివారం 05 జూలై 2020
National - Jun 17, 2020 , 12:54:54

చైనాపై దేశవ్యాప్తంగా నిరసన.. ఆ దేశ జెండాలు, వస్తువులు దహనం

చైనాపై దేశవ్యాప్తంగా నిరసన.. ఆ దేశ జెండాలు, వస్తువులు దహనం

న్యూఢిల్లీ: లఢక్‌లోని గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య మంగళవారం జరిగిన ముఖాముఖి ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతోసహా 20 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం చైనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలు చోట్ల జనం మాస్కులు ధరించి ర్యాలీలు నిర్వహించారు. చైనా జెండాలతోపాటు ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఆ దేశంలో తయారయ్యే వస్తువులను కూడా కాల్చివేశారు. చైనా వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఆ దేశంలో తయారయ్యే వస్తువులను బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 
logo