National
- Dec 03, 2020 , 21:14:05
బురేవి ఎఫెక్ట్ : పుదుచ్చేరిలో రేపు పాఠశాల బంద్

పుదుచ్చేరి : బురేవి తుపాన్ ప్రభావంతో పుదుచ్చేరిలో ఎడతెరిపి వర్షం కురిస్తుండటంతో ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు శుక్రవారం ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాన్ కారణంగా రేపు పుదుచ్చేరిలో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. తుపాన్ ఉత్తర శ్రీలంక మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి మన్నార్ గల్ఫ్ మీద కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. పంబన్ తీరానికి పశ్చిమ దిశగా తుపాన్ కదులుతోంది. పశ్చిమ-నైరుతిలో ప్రయాణించి దక్షిణ తమిళనాడు తీరంలోని పంబన్ - కన్యాకుమారి మధ్య ఇవాళ రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశముంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు
- సరిహద్దు జరిపేశారు
- స్పెషలిస్ట్ కేడర్ పోస్టుల భర్తీకి ప్రకటన
- ప్రమాదాల నివారణపై చర్చ జరగాలి
MOST READ
TRENDING