మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 05, 2020 , 21:14:34

వర్క్ ఫ్రమ్ హోమ్ ఊబెర్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

వర్క్ ఫ్రమ్ హోమ్ ఊబెర్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్

వాషింగ్టన్ : కరోనా మహమ్మారి నేపథ్యంలో ఊబెర్ తమ ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నది. అందులోభాగంగానే జులై 2021 వరకూ తమ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయచ్చంటూ వర్క్ ఫ్రంహోం వెసులు బాటును పొడిగించింది. అంతే కాకుండా ఈ సందర్భంగా ఉద్యోగులు ఇంట్లోనే కార్యలయం ఏర్పాటు చేసుకునేందుకు 500 డాలర్లను ప్రకటించింది.

తమ ఉద్యోగులు దీర్ఘకాలిక ప్రణాళికలు చేసుకోవడానికి అవసరమైన స్పష్టతను, స్వేచ్ఛను కల్పించాలన్న లక్ష్యం తోనే ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని ఊబెర్ ప్రతినిధి తెలిపారు. అందుకోసమే వర్క్ ఫ్రం హోం వెసులుబాటును మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఉద్యోగులు తమ ఇండ్ల లోనే ఆఫీసు పని చేసుకునేందుకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకునేందుకు 500 డాలర్లు కూడా కేటాయిస్తున్నామని ' అని ఆయన పేర్కొన్నారు. 


logo