బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 13:23:01

ప‌ది అంత‌కంటే ఎక్కువ క‌రోనా కేసులుంటే భ‌వ‌నం సీజ్‌

ప‌ది అంత‌కంటే ఎక్కువ క‌రోనా కేసులుంటే భ‌వ‌నం సీజ్‌

ముంబై : ఓ బిల్డింగ్‌లో ప‌ది లేదా అంత‌కంటే ఎక్కువ క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయితే ఆ బిల్డింగ్‌ను అధికారులు సీజ్ చేయనున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్(బీఎంసీ) ఈ నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్‌-19పై స‌మీక్షా స‌మావేశం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ మేర‌కు నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది. జులై ప్రారంభంలో ఓ భ‌వ‌నంలో కోవిడ్ కేసులు న‌మోదైతే ఆ బిల్డింగ్‌లో కొంత భాగాన్ని మాత్ర‌మే సీజ్ చేసేవారు. కాగా తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌తో 10 లేదా అంత‌కంటే ఎక్కువ కేసులు న‌మోదు అయితే ఆ భ‌వ‌నం మొత్తాన్నే సీజ్ చేయ‌నున్నారు. ముంబైలో మంగ‌ళ‌వారం 1,585 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసుల‌తో క‌లుపుకుని ముంబైలో కోవిడ్ కేసుల సంఖ్య 1,73,534కు చేరుకుంది. న‌గ‌రంలో మొత్తం 8,227 కోవిడ్‌-19 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. కోవిడ్‌-19 కేసుల న‌మోదుతో ముంబైలో ఇప్ప‌టివ‌ర‌కు 8,763 బిల్డింగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. న‌గ‌రంలో ప్ర‌స్తుతం 592 కోవిడ్‌ కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.


logo