మంగళవారం 14 జూలై 2020
National - Jun 22, 2020 , 18:29:16

ఒకే భ‌వ‌నంలో 21 మందికి క‌రోనా

ఒకే భ‌వ‌నంలో 21 మందికి క‌రోనా

ముంబై : మ‌హారాష్ర్ట రాజ‌ధాని ముంబైను క‌రోనా వైర‌స్ గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ముంబై మ‌ల‌బార్ హిల్ ఏరియాలోని ఓ రెసిడెన్షియ‌ల్ కాంప్లెక్స్ లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. గ‌త ఏడు రోజుల్లో ఆ కాంప్లెక్స్ లో 21 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు బృహ‌ణ్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు సోమ‌వారం వెల్ల‌డించారు.

ఈ 21 మందిలో 19 మంది.. ప‌ని మ‌న‌షులు, డ్రైవ‌ర్లు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నార‌ని తెలిపారు. అయితే ప‌ని మ‌న‌షులు.. ప‌లు నివాసాల్లో ప‌ని చేస్తుండ‌టంతో.. వీరి ద్వారా మ‌రికొంత మందికి క‌రోనా సోకి ఉండొచ్చ‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ భ‌వ‌నాన్ని పూర్తిగా అధికారులు త‌మ స్వాధీనంలోకి తీసుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. 

ప‌ని మ‌న‌షులు, సెక్యూరిటీ సిబ్బందిని క్వారంటైన్ సెంట‌ర్ల‌కు త‌ర‌లించామ‌ని అధికారులు తెలిపారు. భ‌వ‌నాన్ని మొత్తం శానిటైజ్ చేస్తున్నామ‌ని, అక్క‌డున్న కామ‌న్ టాయిలెట్స్ ను రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు శానిటైజ్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. 

మ‌హారాష్ర్ట‌లో అత్య‌ధికంగా 1,32,075 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 6,170 మంది చ‌నిపోయారు. ముంబైలో అత్య‌ధికంగా 66,488, థానేలో 24,388, పుణెలో 15,881, పాల్గ‌ర్ లో 3,453, ఔరంగాబాద్ లో 3,400 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 


logo