గురువారం 09 జూలై 2020
National - Apr 10, 2020 , 14:32:03

మా ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి లేదు

మా ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి లేదు

అనంతపురం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి సీఎం జగన్‌ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 'కోవిడ్‌-19 నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కరోనా ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేశాం. వైద్య సిబ్బందికి పీపీఈలు సరఫరా చేశాం. మా ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి లేదు. కరోనా పరికరాలు కొనుగోలు చేయలేదని చంద్రబాబు దుష్ప్రచారం తగదు. బాబు హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేయడం దుర్మార్గం. ముఖ్యమంత్రి జగన్‌ చేసే ప్రతి పనిని విమర్శించడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని' బుగ్గన మండిపడ్డారు. 


logo