శుక్రవారం 05 జూన్ 2020
National - Feb 01, 2020 , 23:49:43

ఓడరేవుల కార్పొరేటీకరణ

ఓడరేవుల కార్పొరేటీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: సముద్ర ఓడరేవుల పనితీరు మెరుగుపడిందని, వాటి సామర్ధ్యాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ చెప్పారు. ఓడరేవులను అభివృద్ధిపరిచేందుకు తమ ప్రభుత్వం ఒక ఫ్రేంవర్క్‌తో వస్తున్నదని, కనీసం ఒక పెద్ద ఓడరేవునైనా కార్పొరేటీకరణ చేసి స్టాక్‌ఎక్సేంజిలలో లిస్టింగ్‌ అయ్యేట్టు చూస్తామన్నారు. యాంత్రీకరణ, డిజిటలైజేషన్‌, ప్రక్రియ సరళీకరణ వంటి అంశాల ద్వారా ఓడరేవుల కార్యాచరణ సామర్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. దేశంలో ఉన్న ప్రధాన ఓడరేవులు 2019 మార్చి నాటికి ఏటా 1,514 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగివున్నాయని, 2018-19లో 699.09 మెట్రిక్‌ టన్నుల వాణిజ్యం నిర్వహించినట్టు మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. ఆర్థిక సర్వే ప్రకారం, 2017-18లో సాధించిన సగటు టర్న్‌అరౌండ్‌ టైమ్‌ 64.43 గంటలకు భిన్నంగా 2018-19లో 59.51 గంటలు నమోదైందని చెప్పారు. 2017-18 వార్షిక సంవత్సరంలో 15,333 మెట్రిక్‌ టన్నులుగా ఉన్న రోజుకు షిప్‌ బెర్త్‌ సగటు ఉత్పత్తి నుంచి 2018-19లో 16,541 టన్నులకు పెరిగిందని ఆమె తెలిపారు.


logo