బుధవారం 03 జూన్ 2020
National - May 09, 2020 , 12:46:27

ఉత్త‌రాఖండ్ లో బుద్ధ వాటిక ప్రారంభం

ఉత్త‌రాఖండ్ లో బుద్ధ వాటిక ప్రారంభం

ఉత్త‌రాఖండ్‌: బుద్ధ పూర్ణిమ (మే 7న‌)ను పుర‌స్క‌రించుకుని ఉత్త‌రాఖండ్ లో బుద్ధ వాటిక‌ను ప్రారంభించారు. హ‌ల్ద్వానీలోని ఫారెస్ట్ డిపార్టుమెంట్ క్యాంప‌స్ లో బుద్ధ వాటిక ప్రారంభించిన‌ట్లు రీసెర్చ్ వింగ్ హెడ్ సంజ‌య్ చ‌తుర్వేది తెలిపారు. ఎక‌రం విస్తీర్ణంలో గ‌ల క్యాంప‌స్ లో బుద్ధుడితో అవినాభావ అనుబంధ‌మున్న 13 ర‌కాల మొక్క‌ల‌ను నాటిన‌ట్లు చెప్పారు.

బుద్ధుడు జ‌న్మించిన అశోక చెట్టును, జ్ఞానోద‌యం పొందిన రావిచెట్టు, బుద్ధుడు  తుది శ్వాస విడిచిన (సాల్ చెట్టు) సాల్ మొక్క‌ల‌తోపాటు మ‌రో 10 ర‌కాల మొక్క‌ల‌ను నాటిన‌ట్లు వెల్ల‌డించారు. సిద్దార్థ గౌత‌మ‌గా జ‌న్మించి గౌత‌మ బుద్ధునిగా మారారు. గౌత‌మ బుద్ధుని పుట్టిన‌రోజున ఆయ‌న సేవ‌లను స్మ‌రించుకుంటూ బౌద్దులు, హిందువులు బుద్ధ పూర్ణిమ‌ను జ‌రుపుకుంటారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo