శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 14:11:19

యూపీ ఉపఎన్నిక‌ల్లో మొద‌టిసారి పోటీచేయ‌నున్న బీఎస్పీ

యూపీ ఉపఎన్నిక‌ల్లో మొద‌టిసారి పోటీచేయ‌నున్న బీఎస్పీ

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గనున్న ఉపఎన్నిక‌ల్లో పోటీచేయాల‌ని మాయావ‌తి నేతృత్వంలోని బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) నిర్ణ‌యించింది. ఆ పార్టీ ఉపఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఇదే మొద‌టిసారి. ఇప్ప‌టివ‌రకు ఇత‌ర పార్టీల‌కు మ‌ద్ద‌తునిస్తూ వ‌స్తున్న‌ది. అయితే గ‌త కొంత కాలంగా రాష్ట్రంలో పార్టీ ప్రాభవాన్ని కోల్పోతుండ‌టంతోపాటు, 2022లో అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ఉపఎన్నిక‌ల్లో పోటీచేయాల‌ని నిర్ణ‌యించింది. అదేవిధంగా ఎన్నిక‌ల ద్వారా ఓట‌ర్ల‌ను ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకోవ‌చ్చ‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకోవ‌చ్చ‌ని పార్టీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

రాష్ట్రంలోని నౌగావ‌న్‌, డియోరియా, ఘ‌ట‌మ్‌పూర్‌, బులంద్‌ష‌హ‌ర్‌, తుండ్లా, బంగార‌ము, మ‌ల‌హ‌ని, సువార్ (రాంపూర్‌) స్థానాల‌కు ఉపఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.  217లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇందులో ఆరు స్థానాల్లో బీజేపీ గెలుపొంద‌గా, రెండు సీట్ల‌లో (మ‌ల‌హ‌ని, సువార్‌) స‌మాజ్‌వాదీ పార్టీ విజ‌యం సాధించింది.