బుధవారం 15 జూలై 2020
National - Jun 21, 2020 , 12:31:08

యూపీలో బీఎస్పీ నేత కాల్చివేత‌!

యూపీలో బీఎస్పీ నేత కాల్చివేత‌!

కాన్పూర్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కాన్పూర్ న‌గ‌రంలో దారుణం జ‌రిగింది. బీఎస్పీ నేత‌, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి పింటు సెంగార్‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు కాల్చిచంపారు. కాన్పూర్‌లోని చ‌కేరీ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కాన్పూర్ న‌గ‌ర పోలీస్ చీఫ్ దినేశ్‌కుమార్ ప్ర‌భు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బీఎస్పీ నాయ‌కుడు పింటూ సెంగార్ రాజ‌కీయాల్లో చురుగ్గా ఉంటూనే రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. 

అయితే, శ‌నివారం రాత్రి గుర్తు తెలియ‌ని న‌లుగురు దుండ‌గులు రెండు బైకుల‌పై పింటూ సెంగార్‌ కారును వెంబ‌డించారు. అనంత‌రం సెంగార్ కారు దిగుతుండగానే కాల్పులు జ‌రిపి ప‌రార‌య్యారు. దుండ‌గులు మొత్తం 6 రౌండ్లు కాల్పులు జ‌రిపారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని సెంగార్‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే సెంగార్ మృతిచెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు. 

కాగా, ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. క్లూస్ టీమ్‌ను ర‌ప్పించి ఘ‌ట‌నా ప్రాంతం కావాల్సిన ఆధారాల‌ను సేక‌రించిన‌ట్లు వెల్ల‌డించారు.  


logo