శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 01:43:28

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు దేశద్రోహులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు దేశద్రోహులు

బీజేపీ ఎంపీ ఏకే హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరు: కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్‌ హెగ్డే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పని చేయడానికి సిద్ధంగా లేని’ కేంద్ర ప్రభుత్వరంగ టెలికంసంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులంతా ‘దేశద్రోహులు’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రజలకు సేవలందించడంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ విఫలమైందన్నారు. సోమవారం ఉత్తర కన్నడ జిల్లా కుమ్టాలో జరిగిన బహిరంగ సభలో హెగ్డే చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌లోని ఉద్యోగుల సోమరితనం వల్లే ఆ సంస్థ 85 వేల మందిని తొలగించాలని నిర్ణయించిందన్నారు. ఈ సంస్థను ప్రైవేటీకరించడమే సరైన చర్య అని పేర్కొన్నారు. హెగ్డే వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ఖండించింది. ఆయనతో క్షమాపణ చెప్పించాలని బీజేపీని కోరింది. logo