ఆదివారం 05 జూలై 2020
National - Jun 20, 2020 , 10:00:24

పాకిస్థాన్ నిఘా డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్‌

పాకిస్థాన్ నిఘా డ్రోన్‌ను కూల్చివేసిన బీఎస్ఎఫ్‌

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద విహ‌రిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన నిఘా డ్రోన్‌ను .. బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్ ద‌ళాలు కూల్చివేశాయి.  క‌థువా జిల్లాలోని హీరాన‌గ‌ర్ తాలూకాలో ఉన్న ర‌థువా గ్రామ ఫార్వ‌ర్డ్ పోస్టు వ‌ద్ద డ్రోన్‌ను కుప్ప‌కూల్చారు.  బీఎస్ఎఫ్ 19 బెటాలియ‌న‌కు చెందిన పెట్రోలింగ్ బృందం ఆ డ్రోన్‌ను చూసింది.  బీఎస్ఎఫ్ ద‌ళాలు మొత్తం ఎనిమిది రౌండ్లు పేల్చి ఆ పాక్ డ్రోన్‌ను కూల్చివేశారు.  ఇవాళ ఉద‌యం 5.10 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగింది. 

పన్సార్ బోర్డ‌ర్ పోస్టు వ‌ద్ద పాక్ నిఘా డ్రోన్ విహ‌రిస్తున్న‌ట్లు బీఎస్ఎఫ్ ద‌ళాలు గుర్తించాయి.  డ్రోన్‌ను గుర్తించిన స‌బ్ ఇన్స్‌పెక్ట‌ర్ దేవేందర్ సింగ్ 9ఎంఎం బారెట్టా గ‌న్‌తో ఎనిమిది రౌండ్ల కాల్పులు జ‌రిపారు.  ప‌న్సార్ బోర్డ‌ర్ ఔట్‌పోస్టు వ‌ద్ద డ్రోన్ కుప్ప‌కూలింది. భార‌త్ వైపున ఉన్న అంత‌ర్జాతీయ బోర్డ‌ర్‌కు 250 మీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.డ్రోన్ కూల్చివేత‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉన్న‌ది. 


  


logo