బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 02:42:13

హద్దుల్లేని ప్రేమకు.. సరిహద్ద్దు అడ్డు!

హద్దుల్లేని ప్రేమకు.. సరిహద్ద్దు అడ్డు!

ముంబై: ప్రేమకు హద్దులు లేవు..అన్న మాటను మనస్ఫూర్తిగా నమ్మిన ఆ యువకుడు ఏకంగా దేశ సరిహద్దును దాటి పాకిస్థాన్‌లో తన ప్రేయసిని కలుసుకోవడానికి ప్రయత్నించాడు. అందుకోసం గూగుల్‌ మ్యాప్స్‌ను ఉపయోగించుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన సిద్దిఖీ మహమ్మద్‌ జైషాన్‌కు కరాచీకి చెందిన సమ్రా అనే అమ్మాయి ఫేస్‌బుక్‌లో ప్రేమలో పడ్డారు. సమ్రాపై పీకల దాకా ప్రేమను పెంచుకున్న జైషాన్‌ గుజరాత్‌లోని రాన్‌ ఆఫ్‌ కచ్‌ గుండా పాక్‌లోకి వెళ్లడానికి బైక్‌ వేసుకొని బయల్దేరాడు. గుజరాత్‌లో ఓ చోట బైక్‌ పెట్టి సరిహద్దు వైపు కిలోమీటర్ల దూరాన్ని కూడా లెక్క చేయకుండా నడుచుకుంటూ వెళ్లాడు. అయితే సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల దూరంలోనే జవాన్లు అతన్ని అడ్డగించారు. 


logo