గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 20, 2020 , 09:20:36

పాక్ నుంచి అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆయుధాల ప‌ట్టివేత‌

పాక్ నుంచి అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆయుధాల ప‌ట్టివేత‌

శ్రీన‌గ‌ర్‌: స‌రిహ‌ద్దుల్లో పాకిస్థాన్ ఆగ‌డాలు కొన‌సాగుతున్నాయి. దేశంలో ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌కు అనువుగా త‌ర‌చూ కాల్పుల‌కు పాల్ప‌డుతున్న‌ది. ఇందులో భాగంగా జ‌మ్ముక‌శ్మీర్‌లోని పాక్ స‌రిహ‌ద్దుల్లో ఉన్న అర్నియా వ‌ద్ద మాద‌క ద్ర‌వ్యాలు, ఆయుధాల అక్ర‌మ ర‌వాణాను బీఎస్ఎఫ్ జ‌వాన్లు అడ్డు‌కున్నారు. గ‌స్తీలో భాగంగా శ‌నివారం రాత్రి పాకిస్థాన్ నుంచి దేశంలోకి అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న రెండు పిస్తోళ్లు, నాలుగు మ్యాగ‌జైన్లు, యుద్ధ సామాగ్రి, 58 ప్యాకెట్ల‌లో ఉన్న మ‌త్తుమందును స్వాధీనం చేసుకున్నారు.  

 


logo