సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 01, 2020 , 22:51:29

నాతో బీఎస్‌ఎఫ్‌ కుటుంబం ఉంది..

నాతో బీఎస్‌ఎఫ్‌ కుటుంబం ఉంది..

హైదరాబాద్‌: ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్ల కారణంగా.. బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ మహమ్మద్‌ అనీస్‌ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో, బీఎస్‌ఎఫ్‌ అధికారులు.. అనీస్‌ను ఒడిషాకు ట్రాన్స్‌ఫర్‌ చేసి, అక్కడే పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మహమ్మద్‌ అనీస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన హింస కారణంగా తాను సర్వం కోల్పోయానని అన్నాడు. ఇళ్లు పూర్తిగా దగ్ధమైందనీ, విలువైన వస్తువులు మొత్తం బూడిదపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తన బాధను అర్థం చేసుకున్న బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌, ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారన్నాడు. ఈ సందర్భంగా అనీస్‌.. అధికారులకు ధన్యవాదాలు తెలిపాడు. బీఎస్‌ఎఫ్‌ ఫ్యామిలో ఉండడం తన అదృష్టమని అనీస్‌ ఈ సందర్భంగా వెల్లడించాడు. 


logo