ఆదివారం 17 జనవరి 2021
National - Jan 03, 2021 , 23:14:56

సీఎంగా యెడియూరప్ప మార్పు యోచనే లేదు: తేల్చి చెప్పిన బీజేపీ

సీఎంగా యెడియూరప్ప మార్పు యోచనే లేదు: తేల్చి చెప్పిన బీజేపీ

బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వ సారథి మార్పు చర్చలపై అధికార బీజేపీ నీళ్లు చల్లింది. రాష్ట్ర సీఎంగా బీఎస్‌ యెడియూరప్ప (77) ఇక ముందు కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేసింది.బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి అరుణ్‌ సింగ్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు.

‘ఆయన (యెడియూరప్ప) మన సీఎం అని నేను పలుసార్లు చెప్పాను. ఇక ముందు ఆయన సీఎంగా కొనసాగుతారు. ఆయన సారథ్యంలోనే మేం ముందుకు వెళుతున్నాం. యెడియూరప్ప సొసైటీలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం పట్ల చర్యలు తీసుకుంటున్నారు. పార్టీలోని ప్రముఖ నేతల్లో ఆయన ఒకరు’ అని తెలిపారు. పార్టీకి సంబంధించిన అంశాలపై బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలను అరుణ్‌ సింగ్‌ కోరారు.

ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పబోనని అరుణ్‌ సింగ్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో 2914లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎంలు, కేంద్ర మంత్రులను 75 ఏండ్లు పూర్తయిన తర్వాత తప్పించడం అప్రకటిత విధానంగా కొనసాగుతున్నది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.