శుక్రవారం 03 జూలై 2020
National - Jun 29, 2020 , 20:30:15

‘స్కిల్‌ కనెక్ట్‌ ఫోరం’ ప్రారంభించిన యడ్యూరప్ప

‘స్కిల్‌ కనెక్ట్‌ ఫోరం’ ప్రారంభించిన యడ్యూరప్ప

తమిళనాడు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సోమవారం 'స్కిల్ కనెక్ట్ ఫోరం'ను ప్రారంభించారు.  అనంతరం సీఎం మాట్లాడుతూ అందుబాటులో ఉన్న ఉద్యోగాలు, ఎవరికి ఉద్యోగం అవసరం అనే అంశాలపై పోర్టల్ సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. 'ఈ ఫోరం కింద నిరుద్యోగులకు నైపుణ్యాలు, ఆపై ఉద్యోగం లభిస్తుంది' అని తెలిపారు. ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న యువతకు పోర్టల్ వరంలాంటిదని, నిరుద్యోగ సమస్యను చాలా వరకు పరిష్కరిస్తుందని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎస్‌ అశ్వత్ నారాయణ్ అన్నారు. 'ఇన్నేళ్లుగా ఉద్యోగాల కోసం, రిక్రూటర్లకు మధ్య సమాచార, సమాచార మార్పిడి జరగలేదు. ఆ సమస్యను పోర్టల్ పరిష్కరిస్తుంది' అని చెప్పారు. నిపుణులైన కార్మికులు, జాబ్ మార్కెట్‌పై సరైన సమాచారం లేదని, పోర్టల్ ఏర్పాటు ద్వారా అన్ని సమస్యలు పరిష్కరించినట్లయిందని వివరించారు.


logo