మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Feb 08, 2020 , 16:24:43

భారీగా బ్రౌన్‌ షుగర్‌, గంజాయి పట్టివేత..

భారీగా బ్రౌన్‌ షుగర్‌, గంజాయి పట్టివేత..

మణిపూర్‌: అస్సాం రైఫిల్స్‌, మణిపూర్‌ పోలీసులు  కలిసి సంయుక్తంగా తౌబల్‌లోని అక్రమంగా డ్రగ్స్‌(నిషేధిత ఉత్ప్రేరకాలు) తయారుచేస్తున్న ప్రాంతాన్ని ముట్టడించారు. అక్కడ  ఉన్న డ్రగ్‌ వ్యాపారులను, తయారుదారులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని.. వారి నుంచి 49 కేజీల బ్రౌన్‌ షుగర్‌, 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్‌ తయారు చేసే రసాయనాలను సైతం స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. ఆ ముఠాను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. నిషేధిత డ్రగ్స్‌ తయారు చేయడం, వాటిని వాడడం నేరం. వాటి బారిన పడిన వారు వాటికి బానిసై, మూర్చపోతారనీ.. ఆ మైకంలో ఏం చేస్తారో కూడా తెలియదని తెలిపారు. అనవసరమైన వాటికి యువత దూరంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. కాగా, పోలీసులు స్వాధీనం చేసుకున్న బ్రౌన్‌ షుగర్‌, గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో కోట్లల్లో ఉంటుందని సమాచారం.