సోమవారం 01 జూన్ 2020
National - May 21, 2020 , 15:25:34

వందేభార‌త్‌తో 20 వేల మందిని తీసుకువ‌చ్చాం..

వందేభార‌త్‌తో 20 వేల మందిని తీసుకువ‌చ్చాం..


హైద‌రాబాద్ : విమాన‌యాన శాఖ మంత్రి హ‌రిదీప్ సింగ్ పురి ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని ఇండియాకు తీసుకురాడమే వందేభార‌త్ మిష‌న్ ముఖ్య ఉద్దేశ‌మ‌ని మంత్రి తెలిపారు. నిజంగా విదేశాల్లో చిక్కుకున్న‌వారిని తీసుకురావ‌డంపైనే సంపూర్ణ దృష్టిపెట్టామ‌న్నారు. వివిధ దేశాల నుంచి సుమారు 20వేల మంది భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు.  భార‌తీయుల‌ను త‌ర‌లించిన విమానాల్లోనే.. విదేశాల‌కు వెళ్లాల‌నుకునే వారిని కూడా తీసుకువెళ్లిన‌ట్లు తెలిపారు. విదేశాల్లో నివాసం ఉన్న‌వారు, ఉద్యోగాలు ఉన్న‌వారిని తీసుకువెళ్లిన‌ట్లు చెప్పారు. వందేభార‌త్ మిష‌న్ రెండ‌వ వారంలో ప్ర‌యాణికుల సంఖ్య‌ను పెంచిన‌ట్లు మంత్రి హ‌రిదీప్ తెలిపారు. ఎయిర్ ఇండియాతో పాటు ఇత‌ర ప్రైవేటు సంస్థ‌లు కూడా ప్ర‌యాణికుల త‌ర‌లింపున‌కు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు మంత్రి చెప్పారు.  దేశీయంగా మెట్రో నుంచి మెట్రో న‌గ‌రాల‌కు తొలుత విమానాల‌ను స్టార్ట్ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.logo