మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 15:25:05

‘డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి’

‘డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి’

చెన్నై : డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని తమిళనాడు లారీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యశ్ యువరాజ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. డీజిల్ ధర పెంపును నిరసిస్తూ ఆ రాష్ట్ర లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చెన్నైలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా యశ్‌ యువరాజ్‌ మాట్లాడుతూ.. డీజిల్‌ను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ  కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు హల్వాతోపాటు వినతి పత్రం పంపుతున్నట్లు తెలిపారు. ఇంధన ధరల పెంపు కారణంగా లారీ డ్రైవర్లు జీవనోపాధి కోల్పోతున్నారని, డీజిల్ ధరల పెంపు కారణంగా కరోనా సమయంలో ప్రతి ఒక్కరిపై భారం పడుతుందని  అన్నారు. గత 25 రోజులుగా ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కష్టకాలంలో ప్రభుత్వం ఖజానా నింపుకోవడంపై దృష్టిపెట్టడం సరికాదన్నారు. డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా ఇప్పటివరకు అమలు చేయలేదని ఆరోపించారు.logo