గురువారం 02 జూలై 2020
National - Jun 20, 2020 , 16:47:03

వెయ్యి ప‌డ‌క‌ల‌తో కొవిడ్ ప్ర‌త్యేక ఆస్ప‌త్రి

వెయ్యి ప‌డ‌క‌ల‌తో కొవిడ్ ప్ర‌త్యేక ఆస్ప‌త్రి

ముంబై : మ‌హారాష్ర్ట‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. దేశంలో అత్య‌ధిక కేసులు మ‌హారాష్ర్ట‌లోనే న‌మోదు అవుతున్నాయి. క‌రోనాను నియంత్రించేందుకు  ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో మ‌హారాష్ర్ట ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. 

ఈ క్ర‌మంలో బృహ‌ణ్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో కొవిడ్ 19 ప్ర‌త్యేక ఆస్ప‌త్రి ఏర్పాటు అవుతోంది. ముంబైలోని బైకుల్లా ప‌రిస‌రాల్లోని రిచ‌ర్డ్ స‌న్, క్రుద్దాస్ ఇంజినీరింగ్ కంపెనీలో వెయ్యి ప‌డ‌క‌ల‌తో కొవిడ్ 19 ఆస్ప‌త్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెయ్యి ప‌డ‌క‌ల్లో 300 ప‌డ‌క‌ల‌ను ఐసీయూ బెడ్లుగా మార్చారు. ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాతో పాటు ఇత‌ర సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేస్తున్నారు. జూన్ చివ‌రి నాటికి ఈ ఆస్ప‌త్రి అందుబాటులోకి వ‌స్తుంద‌ని బీఎంసీ ప్ర‌క‌టించింది. 

మ‌హారాష్ర్ట‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 1,24,331 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 5,893 మంది చ‌నిపోయారు. అత్య‌ధికంగా ముంబైలో 64,139, థానేలో 22,033, పుణెలో 14,704, ఔరంగాబాద్ లో 3,164, పాల్గ‌ర్ లో 3,029 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.


logo