శనివారం 11 జూలై 2020
National - Jun 23, 2020 , 11:48:30

భారీ వాహనం వెళ్తుండగా.. కుప్పకూలిన వంతెన

భారీ వాహనం వెళ్తుండగా.. కుప్పకూలిన వంతెన

డెహ్రాడూన్‌: ఓ వంతెనపై భారీ వాహనం వెళ్తుండగా అది కుప్పకూలింది. ఉత్తరాఖండ్‌కు సమీపంలోని సరిహద్దు ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. వాస్తవాధీన నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)కు 65 కిలోమీటర్ల దూరంలోని పితోరాగఢ్ జిల్లాలోని మున్సియారి ప్రాంతంలో రివులేట్ నదిపై బైలీ బ్రిడ్జి ఉన్నది. ఈ వంతెన బలహీనంగా ఉన్నదని స్థానిక పోలీసులు హెచ్చరించినప్పటికీ ఓ భారీ పొక్లైన్‌ను మోసుకెళ్తున్న లారీ ఆ వంతెనపై నుంచి వెళ్లింది. దీంతో ఆ వంతెన కుప్పకూలడంతో ఆ లారీ ఒరిగిపోయింది. 

ఆ వాహనంలో ఉన్న ఇద్దరు గాయపడగా దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ గోదాన్‌ పరిస్థితి నిలడకగా ఉండగా పంజాబ్‌కు లఖ్బీర్ సింగ్ ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో వంతెన అవతలివైపునకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. అయితే ఆ వాహనాన్ని తొలగించిన అనంతరం వారం రోజుల్లో వంతెనకు మరమ్మతులు నిర్వహించి దానిని పునరిద్ధరిస్తామని సరిహద్దు రహదారుల సంస్థ అధికారులు పేర్కొన్నారు. 
logo