సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 14:02:23

బ్రెజిల్లో కరోనా విలయం

బ్రెజిల్లో కరోనా విలయం

బ్ర్రెసిలియా : బ్రెజిల్‌ దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ వేలల్లోనమోదవుతుండడం కలవర పెడుతోంది. మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 24 వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా 500 మంది మృతి చెందారని దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. బ్రెజిల్‌లో ఇప్పటివరకు 2.4 మిలియన్ల మంది కరోనా బారినపడగా 1.63 మిలియన్ల మంది చికిత్సకు కోలుకున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 87 వేల మందికి మృతి చెందారు. వారం క్రితం బ్రెజిల్లో కరోనా మరణాల సంఖ్య 78,700గా ఉంది.  దేశంలో కరోనా విజృంభణ అతి తీవ్రంగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించారు. అమెరికా తరువాత అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశం బ్రెజిలే కావడం గమనార్హం.


logo