గురువారం 02 జూలై 2020
National - Jun 29, 2020 , 13:36:01

ప్రమా­ద­కర స్థాయిలో ప్రవ­హి­స్తున్న బ్రహ్మ­పుత్ర నది

 ప్రమా­ద­కర స్థాయిలో ప్రవ­హి­స్తున్న బ్రహ్మ­పుత్ర నది

గౌహతి: అసోం రాష్ట్రంలో కురు­స్తున్న భారీ వర్షా­లకు బ్రహ్మ­పుత్ర నది ప్రమా­ద­కర స్థాయిలో ప్రవ­హి­స్తు­న్నది. రాజ­ధాని గౌహతి వద్ద నది­లోని వరద ప్రవాహం బాగా పెరు­గు­తు­న్న­దని కేంద్ర జల సంఘం అధి­కారి సాది­కుల్‌ హక్‌ తెలిపారు. దీంతో బ్రహ్మపుత్ర నదిలోని నీటిమట్టం గంటకు 1-2 సెంటీమీటర్లు పెరుగుతున్నదని ఆయన చెప్పారు. ప్రస్తుతం డేంజర్‌ లెవల్‌కు 20 సెంటీమీటర్లకుపైగా నదిలోని నీరు ప్రవహిస్తున్నదని ఆయన వివరించారు. 

అసోంలో కురుస్తున్న భారీ వర్షాలకు బ్రహ్మ­పుత్ర నది ప్రమా­ద­కర స్థాయిలో ప్రవ­హి­స్తుండటంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ధేమాజీ, లఖింపూర్, బిశ్వనాథ్, ఉదల్గిరి, దరాంగ్, నల్బరి, బార్పేట, బొంగైగావ్, కొక్రాజార్, ధుబ్రీ, దక్షిణ సల్మారా, గోల్‌పారా, కమ్రప్ సహా 23 జిల్లాల్లో 9,26,059 మంది ప్రభావితమైనట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 

logo