బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 15:22:16

బ్ర‌హ్మ‌కుమారీస్ చీఫ్ దాది జాన‌కి క‌న్నుమూత‌

బ్ర‌హ్మ‌కుమారీస్ చీఫ్ దాది జాన‌కి క‌న్నుమూత‌

మౌంట్ అబూ ; బ్ర‌హ్మ‌కుమారీల ఆధ్యాత్మిక గురువుగా పేరొందిన రాజ‌యోగిని దాది జాన‌కి క‌న్నుమూశారు. రాజ‌స్థాన్ మౌంట్ అబూలోని గ్లోబ‌ల్ ఆస్ప‌త్రిలో చికిత్స  పొందుతూ తుదిశ్వాస విడిచారు. 104 ఏళ్ల దాది జాన‌కి ఉద‌ర‌, శ్వాస సంబంధ స‌మ‌స్య‌లు రావ‌డంతో ఆమెకు గ్లోబ‌ల్ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. శుక్ర‌వారం వేకువ జామున 2.10 గంట‌ల స‌మ‌యంలో క‌న్నుమూసినట్లు ఆస్ప‌త్రి డాక్ట‌ర్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. 

దాది జాన‌కి ఆత్మ దేవుడి ఒడిలోకి వెళ్లింది. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిద్దాం.  దాది జాన‌కి త‌న జీవ‌న‌శైలితో వ్య‌క్తిగ‌త జీవితానికి అవ‌స‌ర‌మయ్యే సూచ‌న‌లందించి, ఎంతోమందికి ధైర్యాన్నిచ్చార‌ని బ్ర‌హ్మ‌కుమారీస్ స‌భ్యులు సంతాపంలో తెలిపారు.  దాది జంకి ఆక‌స్మిక మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాని మోదీ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. బ్ర‌హ్మ‌ కుమారీల చీఫ్ గా..దాది జాన‌కి ఎంతో శ్ర‌ద్ద‌తో, బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించి స‌మాజ శ్రేయ‌స్సు కోసం పాటుప‌డ్డారు. మ‌హిళా సాధికార‌త కోసం ఎంతో శ్ర‌మించారు. ఆమెను అనురిస్తోన్న ఫాలోవ‌ర్ల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా. ఓం శాంతి అని ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. logo
>>>>>>