గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 10, 2020 , 17:28:37

కంటికి ఇంపైన సిరులు ఈ విరులు.. వీడియో

కంటికి ఇంపైన సిరులు ఈ విరులు.. వీడియో

డెహ్రాడూన్‌: బ్రహ్మకమలం పువ్వు అంటే బ్రహ్మదేవుని ఆస‌నం. ఆయ‌న ఆసీనులై ఉండే పుష్పం. హైందవ సంప్రదాయంలో ఈ బ్ర‌హ్మ క‌మ‌లానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్న‌ది. ఈ అరుదైన విరులు జనారణ్యంలో చాలా తక్కువగా కనిపిస్తాయి. ఈ బ్రహ్మకమలం పూసిన‌ప్పుడు చూడ‌టం వ‌ల్ల అదృష్టం క‌లిసొస్తుంద‌ని, మంచి జ‌రుగుతుంద‌ని చాలా మంది న‌మ్ముతారు. మ‌రికొంత మంది ఈ పుష్పాలు పూయ‌డం చూసి ఎంతో త‌న్మ‌యత్వం చెందుతారు. ఫొటోలు, వీడియోలు తీసి బంధువుల‌కు, స్నేహితుల‌కు షేర్ చేస్తుంటారు. 

కాగా, ఈ పుష్పాల‌కు ఎందుకు అంత క్రేజ్ అంటే అవి ఏడాదిలో ఒక్క‌సారి మాత్ర‌మే పూస్తాయట‌. అందుకే ఇండ్ల‌లో ఆ మొక్క‌లు పెంచేవాళ్లు అవి ఎప్పుడెప్పుడు పూస్తాయా అని ఎదురు చూస్తుంటార‌ట‌. పెర‌ట్లో ఒక్క మొక్క పూస్తేనే అంత అనందాన్నిస్తే.. ఏకంగా బ్ర‌హ్మ క‌మ‌లాల వ‌న‌మే క‌నిపిస్తే ఎలాం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ్‌లో బ్ర‌హ్మక‌మలం మొక్క‌లు విరివిగా ఉంటాయి. ప్ర‌తి ఏడాది చ‌లికాలం ప్రారంభంలో అవి విచ్చుకుని క‌నువిందు చేస్తాయి. మ‌రి ఆ క‌నువిందైన వీడియోను మీరు కూడా చూడండి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.