శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 15:00:08

బ్ర‌హ్మపుత్ర ఉగ్ర‌రూపం..‌! వీడియో

బ్ర‌హ్మపుత్ర ఉగ్ర‌రూపం..‌! వీడియో

గుహ‌హ‌టి: అసోంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పిలేకుండా వ‌ర్షాలు ప‌డుతుండ‌టంతో రాష్ట్ర‌మంతా వ‌ర‌ద బీభ‌త్సం కొన‌సాగుతున్న‌ది. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. బ్ర‌హ్మ‌పుత్ర న‌ది ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున్న‌ది. దీంతో దిబ్రుగ‌డ్ జిల్లాలో వ‌ర‌ద‌లు పోటెత్తుతున్నాయి.  న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతాల‌న్నీ నీట‌మునిగాయి. ఇండ్ల‌లోకి భారీగా వ‌ర‌ద‌నీరు చేరింది. 

దీంతో అధికారులు స‌హాకయ చ‌ర్య‌లు చేప‌ట్టారు. ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. బాధితుల కోసం ప‌లు పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసి అక్క‌డి వారికి ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు. కాగా, రాష్ట్ర‌వ్యాప్తంగా దాదాపు 70 ల‌క్ష‌ల మందిపై ఈ వ‌ర‌ద‌లు ప్ర‌భావం చూపాయి. మృతుల సంఖ్య 85కు చేరింది.         


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo