మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Aug 04, 2020 , 18:40:21

వారు ప్లాస్మా దానానికి అన‌ర్హులట‌!

వారు ప్లాస్మా దానానికి అన‌ర్హులట‌!

హైద‌రాబాద్‌: ప్లాస్మా చికిత్సకు సంబంధించి ఆరోగ్యవంతుల నుంచి సేక‌రించిన ప్లాస్మాను మాత్ర‌మే వాడాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మ‌ధుమేహం, బీపీ లాంటి దీర్ఘ‌కాలిక రోగాలు ఉన్న వాళ్లు ప్లాస్మా దానానికి అనర్హులని వారు చెబుతున్నారు. కరోనా సోకినవారికి ప్లాస్మా చికిత్స ఆశాకిరణంలా కనిపిస్తున్న‌ది. క‌రోనా నుంచి కోలుకున్న వారిలో యాంటీ బాడీలు త‌యార‌వుతున్నందున వారి ప్లాస్మాను సేక‌రించి క‌రోనా రోగుల‌కు చికిత్స చేస్తున్నారు.  

అయితే, కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరి ప్లాస్మా ప్లాస్మాచికిత్సకు ఉపయోగపడద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య‌వంతుల ప్లాస్మాతోనే ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని తెలుపుతున్నారు. ప్లాస్మా దానానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యాభై కిలోల కంటే అధిక బరువు ఉన్నవాళ్లు, పిల్లలులేని మహిళలు, శరీరంలో ఆరోగ్యక‌ర‌ స్థాయిలో హీమోగ్లోబిన్ ఉన్నవాళ్లు, మధుమేహం, బీపీ లేనివాళ్లు ప్లాస్మా దానం చేయవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo