మంగళవారం 26 మే 2020
National - May 15, 2020 , 02:32:42

అలసి.. సొలసి సూట్‌కేస్‌పైనే నిద్ర!

అలసి.. సొలసి సూట్‌కేస్‌పైనే నిద్ర!

చిన్నారికీ వలస కష్టాలు

వందలాది కిలోమీటర్ల దూరాన్ని నడువలేక ఆ చిన్నారి కాళ్లు అలిసిపోయాయి. దీంతో తమతో తెచ్చుకున్న చక్రాల సూట్‌కేసుపై నిలబడే దీనంగా నిద్రపోయాడు. ఆ సూట్‌కేసుకు ఓ తాడును కట్టిన బాలుడి తల్లి.. తమ గమ్యాన్ని చేరుకోవాలన్న ఆశతో ఎంతో కష్టంతో దాన్ని లాక్కుంటూ ముందుకు కదిలింది. గుండెల్ని పిండేఈ హృదయ విదారక దృశ్యం ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో గురువారం కనిపించింది. లాక్‌డౌన్‌ కాలంలో వలస కూలీలు పడుతున్న కష్టాలకు ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తున్నది. పంజాబ్‌ నుంచి బిడ్డతో బయల్దేరానని, యూపీలోని ఝాన్సీకి (800 కి.మీ) చేరుకోవడమే తన లక్ష్యమని ఆ మహిళ వివరించింది.


logo