గురువారం 28 మే 2020
National - May 17, 2020 , 12:46:28

రాష్ట్రాల రుణ ప‌రిమితి 5 శాతానికి పెంపు..

రాష్ట్రాల రుణ ప‌రిమితి 5 శాతానికి పెంపు..


హైద‌రాబాద్‌: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఊర‌ట‌నిచ్చే ప్ర‌క‌ట‌న చేసింది. రాష్ట్రాలు రుణం తీసుకునే ప‌రిమితిని మూడు నుంచి అయిదు శాతానికి పెంచుతున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఇవాళ అయిదో ద‌శ ఆర్థిక అంశాల‌ను ప్ర‌క‌టించిన మంత్రి.. రుణ ప‌రిమితిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వాల త‌ర‌హాలోనే కేంద్రం కూడా త‌మ ఆదాయంలో తీవ్ర త‌రుగుద‌ల ఎదుర్కొంటోంద‌న్నారు. అయినా కానీ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం స‌హ‌కారం అందిస్తూనే ఉంద‌న్నారు. జీఎస్‌డీపీలోని 3 శాతం ఆధారంగానే 2020-21 సంవ‌త్స‌రానికి రాష్ట్రాల‌కు 6.41 ల‌క్ష‌ల కోట్ల రుణం తీసుకునేందుకు సీలింగ్ పెట్టారు.  దీంతో ఆయా రాష్ట్రాలకు ఈ ఏడాది మార్చిలో 75 శాతం రుణం ఇచ్చేసిన‌ట్లు చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 14 శాతం మాత్రం రుణం తీసుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. ఇంకా 86 శాతం రుణం అలాగే మిగిలి ఉంద‌న్నారు.  ఈ నేప‌థ్యంలో రుణ ప‌రిమితిని 3 నుంచి 5 శాతానికి పెంచుతున్న‌ట్లు మంత్రి తెలిపారు. logo