శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 12:41:48

చేతుల్లేకుంటేనేం.. విశ్వాసంతో కారు నడుపుతోంది.. వీడియో

చేతుల్లేకుంటేనేం.. విశ్వాసంతో కారు నడుపుతోంది.. వీడియో

మనిషికి పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించొచ్చు. పట్టుదల, చిత్తశుద్ధితో పాటు ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యమే. ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. వారు అనుకున్న లక్ష్యం కోసం నిర్విరామంగా కృషి చేస్తారు.. వారు కన్న కలలను సాకారం చేసుకుంటారు. జిలుమూల్‌ మారియట్‌ థామస్‌(28) అనే మహిళకు పుట్టుకతోనే చేతుల్లేవు. మిగతా అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి. థాలిడోమైడ్‌ సిండ్రోమ్‌ కారణంగా ఆమె పుట్టుకతోనే చేతుల్లేకుండా జన్మించింది. తనకు చేతులు లేనప్పటికీ అందరిలాగే కారు నడపాలని మనసులో నిశ్చయించుకుంది. అందు కోసం కఠోర సాధన చేసింది. కాళ్లతోనే స్టీరింగ్‌ను తిప్పుతూ.. గేర్లను కూడా కాళ్లతోనే మార్చుకుంది. మొత్తానికి తాను కన్న కలను సాకారం చేసుకుంది థామస్‌. 

ఈ సందర్భంగా థామస్‌ను ఓ ఇంగ్లీష్‌ మీడియా పలుకరించింది. 'గత ఆరేళ్లుగా వైనీ ప్రింటింగ్స్‌లో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పని చేస్తున్నాను.  కారును నడపాలన్నది నా చిన్నప్పటి కల. 2014లో నాకు లైసెన్స్‌కు టెస్టుకు అనుమతివ్వాలని ఆర్టీవో అధికారులను ఆశ్రయించాను. అయితే మీ లాంటి వ్యక్తులు ఇండియాలో ఎవరైనా డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కలిగి ఉంటే.. ఆ కాపీని తీసుకుని రావాలని తనను ఆదేశించారు. మొత్తానికి నా లాంటి వ్యక్తికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇచ్చినట్లు సమాచారం దొరికింది. అతనే విక్రమ్‌ అగ్నిహోత్రి. నేను డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు 2018లో చర్యలు ప్రారంభించాను. నాకు కారు నడిపేందుకు అదే ఏడాది కోర్టు కూడా అనుమతిచ్చింది. ఆర్టీవో అధికారుల సూచన మేరకు కారును తీసుకుని.. నాకు అనుగుణంగా మార్పులు చేయించుకున్నాను. కానీ నా కారు ఇంకా రిజిస్ట్రేషన్‌ కాలేదు. ఏదో ఒక రోజు నా కారును రోడ్డుపై నడుపుతాననే విశ్వాసం ఉంది' అని థామస్‌ పేర్కొన్నారు. 


logo