సోమవారం 25 మే 2020
National - Apr 03, 2020 , 13:42:54

బాబు పేరు 'కొవిడ్'‌.. పాప పేరు 'కరోనా'..

బాబు పేరు 'కొవిడ్'‌.. పాప పేరు 'కరోనా'..

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మహిళ పండంటి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలకు ఆమె ముద్దుగా కొవిడ్, కరోనా అని నామకరణం చేసింది. బాబు పేరును కొవిడ్  గా, పాప పేరును కరోనాగా పెట్టింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రీతివర్మ(27) అనే గర్భిణి తన భర్తతో కలిసి రాయ్‌పూర్‌లో ఉంటుంది.

గర్భిణికి నెలలు నిండడంతో మార్చి 26న రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను 102 వాహనంలో రాయ్‌పూర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మెమోరియల్‌ ఆస్పత్రికి తరలించారు. మార్చి 27న తెల్లవారుజామున ఒకే కాన్పులో పాప, బాబుకు జన్మనిచ్చింది. తనకు, పిల్లలకు గుర్తుండేలా వారికి నామకరణం చేయాలని భర్తతో తన అభిప్రాయాన్ని పంచుకుంది. ఇద్దరి అభిప్రాయం మేరకు పాపకు కరోనాగా, బాబుకు  కొవిడ్ గా నామకరణం చేశారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు.  

మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజున ఉత్తరప్రదేశ్‌ గోరఖ్‌పూర్‌లో పుట్టిన పాపకు కరోనా అని పేరు పెట్టారు. మార్చి 30న డియోరియా జిల్లాలోని ఖుకుందు గ్రామంలో జన్మించిన బాబుకు అతని తల్లిదండ్రులు లాక్‌డౌన్‌ అని నామకరణం చేశారు.


logo