సోమవారం 18 జనవరి 2021
National - Jan 05, 2021 , 14:46:36

బోరిస్ జాన్స‌న్ ఇండియాకు వ‌స్తున్నారు..

బోరిస్ జాన్స‌న్ ఇండియాకు వ‌స్తున్నారు..

న్యూఢిల్లీ:  గ‌ణ‌తంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొనేందుకు బ్రిటీష్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ భార‌త రానున్నారు.  ఈ విష‌యాన్ని బ్రిటీష్ హై క‌మిష‌న్ వెల్ల‌డించింది.  బోరిస్ జాన్స‌న్ ప్ర‌ణాళిక‌లో ఎటువంటి మార్పు లేద‌ని హై క‌మిష‌న్ చెప్పింది.  క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇంగ్లండ్‌లో మ‌ళ్లీ క‌ఠిన‌రీతిలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే.  ఢిల్లీలో జ‌రిగే ఆర్డీ ప‌రేడ్‌లో పాల్గొనేందుకు ఇటీవ‌ల బోరిస్ జాన్స‌న్ ఆస‌క్తి చూపారు.  భార‌త్ ఆహ్వానాన్ని గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అయితే సెప్టెంబ‌ర్‌లో కొత్త క‌రోనా స్ట్రెయిన్ విజృంభించడంతో.. బ్రిట‌న్‌లో ప‌రిస్థితులు సీరియ‌స్‌గా మారాయి.  ఆ దేశం ట్రావెల్ ఆంక్ష‌లు విధించింది.