గురువారం 28 మే 2020
National - May 21, 2020 , 13:53:03

బిర్యానీ కోసం కరోనా బాధితులు ఆర్డర్‌.. ఐసోలేషన్‌ వార్డులో అలర్ట్‌

బిర్యానీ కోసం కరోనా బాధితులు ఆర్డర్‌.. ఐసోలేషన్‌ వార్డులో అలర్ట్‌

చెన్నై : ఓ నలుగురు కరోనా బాధితులు.. బిర్యానీ కోసం ఆర్డర్‌ చేశారు. బిర్యానీతో డెలివరీ బాయ్‌ ఆస్పత్రికి చేరుకోగానే ఐసోలేషన్‌ వార్డు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. తమిళనాడులోని సేలం ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులోని నలుగురు కరోనా బాధితులకు ప్రతి రోజూ శాఖాహారం ఇస్తున్నారు. అయితే వారికి బిర్యానీ తినాలనిపించింది. దీంతో ఆన్‌లైన్‌లో బిర్యానీ కోసం కరోనా బాధితులు ఆర్డర్‌ చేశారు. కాసేపటికే బిర్యానీ, తండూరీ చికెన్‌ ఆస్పత్రికి వచ్చింది. లోకేషన్‌ ఆధారంగా ఐసోలేషన్‌ వార్డులోకి వస్తున్న డెలివరీ బాయ్‌ను అక్కడున్న భద్రతా సిబ్బంది ఆపారు. డాక్టర్లకు సమాచారం అందించారు. 

మొత్తానికి ఫుడ్‌ డెలివరీ బాయ్‌ను డాక్టర్లు అక్కడ్నుంచి తిరిగి పంపారు. ప్రతి రోజు శాఖాహారం తిని విసిగిపోయామని, అందుకే నాన్‌ వెజ్‌ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశామని నలుగురు బాధితులు చెప్పుకొచ్చారు. కానీ ఈ సమయంలో మసాలాలతో కూడిన మాంసాహారం తింటే గ్యాస్ట్రిక్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. 

నలుగురు బాధితుల్లోని ఒకరి బంధువు మీడియాతో మాట్లాడారు. నలుగురిలో ఒకరు డ్రైవర్‌ అని ఆయన తెలిపాడు. ఆ డ్రైవర్‌కు ప్రతి రోజూ నాన్‌ వెజ్‌ తినే అలవాటు ఉంది. గత కొన్ని రోజుల నుంచి నాన్‌ వెజ్‌ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో నాన్‌ వెజ్‌ కోసం ఆర్డర్‌ చేయాల్సి వచ్చి ఉండొచ్చని బంధువు పేర్కొన్నాడు.


logo