గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 11:12:36

కర్ణాటక నుంచి తమిళనాడు అడవులకు ఏనుగుల మంద వలస

కర్ణాటక నుంచి తమిళనాడు అడవులకు ఏనుగుల మంద వలస

కృష్ణగిరి : కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి దాదాపు 130 ఏనుగులు తమిళనాడు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. దీంతో అటవీశాఖ అధికారులు అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. హోసర్‌ అటవీ డివిజన్‌లోని జ్వాలాగిరి ఫారెస్టు రేంజర్‌ నాగార్జన్‌ ఇప్పటికే  థాలి, జ్వాలాగిరి గ్రామస్తులతో సమావేశమయ్యారు. కర్ణాటక నుంచి 130 ఏనుగులు రెండు మందలుగా విడిపోయి సరిహద్దులోని థాలి, జ్వాలాగిరి అటవీ ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు ఆయన తెలిపారు.

సాధారణంగా తమిళనాడులోని బన్నీర్‌ఘాట్‌ అటవీ ప్రాంతం నుంచి ప్రతి వర్షాకాలం ఏనుగులు కర్ణాటకకు వలస వెళ్తుంటాయని చెప్పారు. ఈ నాలుగు నెలలు ఏనుగులు ఇక్కడి అటవీ ప్రాంతంలోనే ఉంటాయని, ఈ సీజన్‌లో ఇక్కడ రాగి, హర్స్‌గ్రామ్‌ పంటలు సాగు చేస్తుంటారని వీటిని తినేందుకు ఏనుగులు ఇష్టపడుతుంటాయని తెలిపారు. అటవీ సరిహద్దులో పొలాలున్న రైతులు రాత్రివేళ వెళ్లవద్దని కోరారు. పశువులు కాసే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo