శనివారం 06 జూన్ 2020
National - May 21, 2020 , 13:16:04

స్టేష‌న్‌ కౌంట‌ర్ల వ‌ద్ద రైల్వే టికెట్ల బుకింగ్‌..

స్టేష‌న్‌ కౌంట‌ర్ల వ‌ద్ద రైల్వే టికెట్ల బుకింగ్‌..

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా జూన్ ఒక‌ట‌వ తేదీ నుంచి కొన్ని రైళ్ల‌ను పున‌రుద్ద‌రిస్తున్న విష‌యం తెలిసిందే.  అయితే ఇవాళ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా సుమారు 200 రైళ్ల‌కు ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభించారు. ఇక రాబోయే రెండుమూడు రోజుల్లో.. రైల్వే స్టేష‌న్ల‌లో ఉన్న కౌంట‌ర్ల వ‌ద్ద బుకింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ తెలిపారు.  దేశ‌వ్యాప్తంగా ఉన్న 1.7 కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల వ‌ద్ద రేప‌టి నుంచి బుకింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  స్టేష‌న్ల వ‌ద్ద నిర్వ‌హించే బుకింగ్ కోసం ప్రోటోకాల్‌ను త‌యారు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. రానున్న కొన్ని రోజుల్లో మ‌రిన్ని రైళ్ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. రైల్వే స్టేష‌న్లలో ఉన్న షాపుల‌ను ఓపెన్ చేసేందుకు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు తెలిపారు. కానీ టేక‌వేలు మాత్రమే అందుబాటులో  ఉంటాయ‌న్నారు. జూన్ ఒక‌టి నుంచి న‌డిచే సుమారు 73 రైళ్లకు సంబంధించి ల‌క్షా 49 వేల టికెట్లు బుక్ అయిన‌ట్లు ఇవాళ రైల్వేశాఖ వెల్ల‌డించింది.logo