శనివారం 11 జూలై 2020
National - Jun 06, 2020 , 10:52:40

31 దేశాల నుంచి 38 వేల మంది స్వదేశానికి

31 దేశాల నుంచి 38 వేల మంది స్వదేశానికి

న్యూఢిల్లీ: మూడో విడత వందేభారత్‌ మిషన్‌లో భాగంగా అమెరికా, కెనడా, యూకే, ఐరోపా దేశాల్లో ఎంపికచేసిన గమ్యస్థానాలకు టికెట్ల అమ్మకాలను ఎయిర్‌ ఇండియా శుక్రవారం ప్రారంభించింది. కేవలం రెండు గంటల్లోనే 1700 సీట్లను అమ్ముడుపోగా, సుమారు ఆరు కోట్ల హిట్లు వచ్చాయని సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉదయం 8 గంటల వరకు 22 వేల టికెట్లు అమ్ముడుపోయాయని తెలిపింది. మూడో విడత వందేభారత్‌ మిషన్‌ జూన్‌ 11 నుంచి 30వ తేదీ వరకు కొనసాగనుంది. 

జూన్‌ 18 నుంచి 23 వరకు యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు ఐదు విమానాలను నడపనుంది. వీటిద్వారా సుమారు 1200 మంది భారతీయులను స్వదేశానికి తరలించనుంది. అదేవిధంగా అమెరికా, కెనడాలకు జూన్‌ 11 నుంచి 30వ తేదీవరకు 70 విమానాలను నడపనున్నామని కేంద్ర విమానయానశాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరి తెలిపారు.  

లాక్‌డౌన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రప్రభుత్వం వందేభారత్‌ మిషన్‌ను చేపట్టింది. ఇప్పటిరకు రెండు విడతలుగా సాగిన వందేభారత్‌ కార్యక్రమం ద్వారా 1,70,123 మంది స్వదేశానికి చేరుకున్నారు. మూడో విడతలో భాగంగా 31 దేశాల్లో చిక్కుకుపోయిన 38 వేల మందిని స్వదేశానికి తరలించనున్నారు. 


logo