ఆదివారం 05 జూలై 2020
National - Jun 30, 2020 , 15:17:49

క‌స్ట‌డీ డెత్‌.. పోలీసుల‌పై మ‌ర్డ‌ర్ కేసు పెట్టాల‌న్న మ‌ద్రాసు హైకోర్టు

క‌స్ట‌డీ డెత్‌.. పోలీసుల‌పై మ‌ర్డ‌ర్ కేసు పెట్టాల‌న్న మ‌ద్రాసు హైకోర్టు

 హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడులోని తూత్తుకుడిలో తండ్రీకొడుకులు పోలీసు క‌స్ట‌డీలో చ‌నిపోయిన ఘ‌ట‌న ప‌ట్ల ఇవాళ మ‌ద్రాస్ హైకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది.  ఈ కేసును సీబీఐ స్వీక‌రించే వ‌ర‌కు.. సీఐడికి అప్ప‌గించాల‌ని పేర్కొన్న‌ది.  తిరున‌ల్‌వెళ్లికి చెందిన‌ సీబీ-సీఐడీ డీఎస్పీ అనిల్ కుమార్ .. ఈ కేసును విచారించాల‌ని కోర్టు ఆదేశించింది.  తూత్తుకుడికి చెందిన మొబైల్ షాపు ఓన‌ర్లు అయిన పీ జ‌య‌రాజ్‌, జే బెనిక్స్‌ల‌ను ఇటీవ‌ల స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. లాక్‌డౌన్ నిబంధ‌న ఉల్లంఘించి షాపు తెరిచార‌ని వారిని అరెస్టు చేశారు. అయితే లాక‌ప్‌లో ఉన్న వారు .. రెండు రోజుల వ్య‌వ‌ధి తేడాలో మృతిచెందారు. 

ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది.  పోస్టుమార్ట‌మ్ నివేదిక‌, జుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ నివేదిక ఆధారంగా.. స‌త్తానుకులం పోలీసుల‌పై హ‌త్య అభియోగం న‌మోదు చేసేందుకు కావాల్సిన ఆధారాలు ఉన్న‌ట్లు మ‌ద్రాసు హైకోర్టు పేర్కొన్న‌ది. ఐపీసీ 302 ప్ర‌కారం పోలీసుల‌పై కేసు నమోదు చేయ‌వ‌చ్చు అని కోర్టు చెప్పింది.  ఈ రోజు మ‌ధ్యాహ్నం నుంచే సీఐడీ విచార‌ణ జ‌ర‌గాల‌ని డివిజ‌న్ బెంచ్ స‌భ్యులైన జ‌స్టిస్ పీఎన్ ప్ర‌కాశ్‌, బీ పుగ‌లేందిలు తీర్పునిచ్చారు. కావాల‌నుకుంటే ఈ కేసుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం సీబీఐకి కూడా అప్ప‌గించ‌వ‌చ్చు అని కోర్టు పేర్కొన్న‌ది. logo