బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 22, 2020 , 00:50:39

కేంద్ర ఉద్యోగులకు బోనస్‌

కేంద్ర ఉద్యోగులకు బోనస్‌

  • దసరా నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
  • 30.67 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి

న్యూఢిల్లీ: దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించింది. 30.67 లక్షల మంది నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు రూ. 3,737 కోట్లు బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా వేళ దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయిన నేపథ్యంలో మార్కెట్‌కు ఊతమిచ్చేందుకు బోనస్‌ ప్రకటించినట్టు కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చెప్పారు. ఈ వారంలోనే బోనస్‌ను పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు, జమ్ముకశ్మీర్‌లో ‘జమ్ముకశ్మీర్‌పంచాయతీరాజ్‌ చట్టం-1989’ అమలును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించిందని చెప్పారు. దీనివల్ల ఇకపై జమ్ముకశ్మీర్‌లో మూడంచెల పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమల్లో ఉంటుందని, జమ్ముకశ్మీర్‌ ప్రజలు కూడా తమ గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో తమ ప్రతినిధులను తామే స్వయంగా ఎన్నుకోవచ్చని చెప్పారు.