బుధవారం 08 జూలై 2020
National - Jun 16, 2020 , 17:12:01

విద్యావేత్తకు బాంబే హైకోర్టు షాక్‌

విద్యావేత్తకు బాంబే హైకోర్టు షాక్‌

ముంబై : కరోనా బాధితులకు ఉచిత వైద్యం అందించాలని కోరిన ఓ విద్యావేత్తకు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ముంబైలో కరోనా బాధితులకు చికిత్సలందించేందుకు ప్రభుత్వం 80శాతం బెడ్లను స్వాధీనం చేసుకొని ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫీజులు వసూలు చేసేలా, మిగతా 20శాతం బెడ్లకు దవాఖానలు ఫీజులు వసూలు చేసుకునేందుకు మహారాష్ట్ర సర్కారు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టి, ఉచితంగా చికిత్సలందించేలా చూడాలని విద్యావేత్త, సామాజిక కార్యకర్త సాగర్‌ జొంధాలే బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు అధికంగా ఫీజులు వసూలు చేస్తాయని, జనరల్‌ వార్డులో చేర్పించినా బిల్లు దాదాపు రూ.లక్ష వరకు అవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫార్మసీ, పాథాలజీ సేవల కోసం ప్రత్యేకంగా ఫీజులు వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్‌ బెంచ్‌ డిమాండ్ అర్థరహితమైందంటూ పిటిషనర్‌కు రూ.5లక్షలు జరిమానా విధించారు. మొత్తాన్ని నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వద్ద జమ చేయాలని ఆదేశించారు.


logo