ఇది కంగనపై పగ తీర్చుకున్నట్లు ఉంది!

ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ఊరట కలిగించే తీర్పు వెలువరించింది బాంబే హైకోర్టు. ఆమె భవనంలో కొంత భాగాన్ని కూల్చేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఇచ్చిన ఆర్డర్‌ను కొట్టేసింది. ఇది ఆమెపై పగ తీర్చుకోవడానికి ఇచ్చిన ఆర్డర్‌లాగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏ పౌరుడిపై అయినా అధికారులు ఇలా బల ప్రయోగం చేయడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని స్పష్టం చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న చర్య అనధికారం అనడంలో తమకు ఎలాంటి సందేహం లేదని డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు ఎస్జే కథావాలా, ఆర్ఐ చాగ్లా అన్నారు. సెప్టెంబర్ 9న బీఎంసీ అధికారులు తన బంగ్లాను కూల్చేయడాన్ని సవాలు చేస్తూ కంగనా కోర్టుకెక్కింది. బీఎంసీ ఇలా చేయడం కచ్చితంగా చట్టవిరుద్ధమని, పౌరుల హక్కులకు భంగం కలిగించడమే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నష్టపరిహారానికి సంబంధించి ప్రత్యేకంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ఓ వాల్యూయర్‌ని నియమిస్తున్నట్లు కోర్టు తెలిపింది. 2021 మార్చిలోపు జరిగిన నష్టంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
తాజావార్తలు
- ట్రాక్టర్ ర్యాలీ హింస: 33 కేసులు.. 44 లుక్ అవుట్ నోటీసులు
- వెంకీ-వరుణ్ 'ఎఫ్ 3' విడుదల తేదీ ఫిక్స్
- 40ఏండ్ల ఇండస్ట్రీకి కూడా ఇది తెలుసు. కానీ,
- శ్యామ్‌సంగ్ మరో బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎంవో2 ..! 2న లాంచింగ్!!
- ప్రపంచంలోనే అత్యధిక కార్లు విక్రయించిన కంపెనీ ఇదే..!
- సోనూసూద్ కోసం 2 వేల కి.మీ సైక్లింగ్..!
- డాలర్ జాబ్‌లపై మోజు ఎందుకంటే!
- కొవిడ్ - 19 : రెండు రాష్ట్రాల్లోనే 67 శాతం కేసులు
- జైష్ ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం
- పోషకాహార లోప నివారణ ప్రతిపాదనల అమలుకు సిద్ధం