ఆదివారం 12 జూలై 2020
National - Jun 16, 2020 , 17:52:08

కరోనా చికిత్స కోరితే రూ.5 లక్షల జరిమానా

కరోనా చికిత్స కోరితే రూ.5 లక్షల జరిమానా

ముంబై: ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాప్తించి భయపెడుతున్నందున కోరినవారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపించాలని కోరిన ఓ విద్యావేత్తకు ముంబై హైకోర్టు రూ. 5 లక్షల జరిమానా విధించింది. వైరస్ వ్యాప్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడుతున్న సమయంలో ఇటువంటి కోరిక కోరడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 మహారాష్ట్రలని అన్ని దవాఖానల్లో కొవిడ్-19 వ్యాధిగ్రస్తులందరికీ ప్రభుత్వమే ఖర్చు భరించి చికిత్స అందించాలని కోరుతూ ప్రముఖ విద్యావేత్త సాగర్ జోంధాలే, కుర్లా నివాసి సారికాసింగ్ తో కలిసి ముంబై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా.. విచారించిన ప్రధాన న్యాయమూర్తి దీపంక దత్త, జస్టిస్ ఎస్ ఎస్ షిండేలతో కూడన బెంచ్ వారి పిల్ ను విచారించింది.  మహారాష్ట్ర అంతటా కొవిడ్-19పరీక్షలు జరిపించి చికిత్స అందించాలని కోరారు. జోంధాలే తరఫున హాజరైన న్యాయవాది ఆనంద్ జోంధాలే, సారికా సింగ్ తరఫున న్యాయవాది వర్షా జగ్దాలే వాదించారు. కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు ప్రైవేటు, నర్సింగ్ హోంలతో 80 శాతం పడకలు అవసరం అవుతాయని మే 21 న ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నదిని, అయితే ప్రభుత్వపరంగా స్పష్టమైన ఆదేశాలులేకోవడంతో ప్రైవేటు దవాఖానలు, నర్సింగ్ హోంలు పెద్ద ఎత్తున లాభాలు పొందేలా ఛార్జీలు విధిస్తాయని వాదించారు.  ప్రైవేటు దవాఖానలకు పోయి పేదలు చికిత్స తీసుకోలేరని, అందువలన ప్రభుత్వమే చికిత్స బాధ్యత తీసుకొనేలా ఆదేశాలు జారీచేయాలని వారు కోరారు. 

కరోనా వైరస్ సోకిన వారికి పరీక్షలు జరిపి చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఆశుతోష్ కుంభ్ కోణి కోర్టుకు విన్నవించారు. దాంతో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొంటున్న సమయంలో ఇలాంటి పిటిషన్లో చేసిన డిమాండ్లు పనికిరానివని, ముందస్తుగా ఉన్నాయని వారి పిటిషన్ ను కొట్టివేసింది. రూ. 5 లక్షలను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులకు జమచేయాలని ఆదేశించింది. logo